న్యూఢిల్లీ : ఈ ఏడాది వెలువడిన క్యూఎస్-ర్యాంకింగ్స్‌లో 9 భారతీయ విద్యా సంస్థలు తమ సత్తా చాటాయి. బిజినెస్, మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు వరల్డ్ టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్ 27వ ర్యాంక్ (గత ఏడాది 22), ఐఐఎం బెంగళూరు 40వ ర్యాంక్ (గత ఏడాది 32) సాధించాయి. గతంతో పోల్చితే ఈ రెండు విద్యా సంస్థల ర్యాంకింగ్స్ పడిపోయాయి. ఇంజినీరింగ్-మినరల్, మైనింగ్ విభాగంలో ధన్‌బాద్‌లోని ఐఎస్‌ఎంకు 20వ ర్యాంకు, ఐఐటీ-బాంబేకు 28, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 45వ ర్యాంకు దక్కింది.