న్యూఢిల్లీ, నవంబర్ 25: గత 10ఏండ్లలో మొత్తం 853 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పొందారని కేంద్రం తాజాగా వెల్లడించింది. 2014-2024లో ఆదాయపు పన్ను విభాగానికి చెందిన 383 మంది, సుంకాలు, పరోక్ష పన్నుల విభాగానికి చెందిన 470మంది ఐఆర్ఎస్ అధికారులు వీఆర్ఎస్ ద్వారా రిటైర్ అయ్యారని కేంద్రం తెలిపింది.
ఈ మేరకు సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరీ రాతపూర్వక సమాధానమిచ్చారు.