న్యూఢిల్లీ : మనవరాలి పెండ్లికి ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న 83 ఏండ్ల బామ్మ జీవితంలో తొలిసారిగా విమానంలో అడుగుపెట్టారు. బామ్మ విమానయానానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 60 లక్షల మంది వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో ఇంటి నుంచి బయలుదేరిన బామ్మ ఎయిర్పోర్ట్కు చేరుకుని విమానం ఎక్కడం కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో కలిసి విమానంలో ఆమె చిరునవ్వులు చిందిస్తూ తన సీట్లో కూర్చోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ క్యూట్ వీడియో నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయించింది.
బామ్మను బేబీలా ట్రీట్ చేస్తూ ఎంతో కేర్ తీసుకుని వివాహ వేదికకు తీసుకువెళ్లడం గొప్పవిషయమని యూజర్లు రాసుకొచ్చారు. మా బామ్మ కూడా 88 ఏండ్ల వయసులో తొలిసారి విమానం ఎక్కారని మరో యూజర్ గుర్తుచేసుకున్నారు. బామ్మ కలకాలం ఆరోగ్యంగా జీవించాలని పలు యూజర్లు కామెంట్ చేశారు.