హవేరి: కర్నాటకలోని హవేరి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లిని గుర్తించారు. ఆ భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత లోనయ్యారు. వెంకటాపుర తండాలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఈ ఘటన జరిగింది. రాణిబెన్నూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి ఆ విద్యార్థుల్ని చికిత్స కోసం తీసుకువెళ్లారు. పిల్లలు చికిత్స నుంచి కోలుకున్నారని, వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు స్కూల్ అధికారులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారుల్ని ఆదేశించింది. ఇటీవల తమిళనాడులోనూ ఇలాంటి ఘటన జరిగింది. పురుగులతో ఉన్న కుళ్లిన గుడ్లను మిడ్డే మీల్లో పిల్లలకు పెట్టారు. ఆ ఘటనలోనూ విద్యార్థులు అనారోగ్యానికి లోనయ్యారు.