Shubhanshu Shukla | రోదసిలోకి శుభాన్షు శుక్లా.. ఎనిమిది నిమిషాల్లోనే భూమికి చేరిన ఫాల్కన్ రాకెట్
Shubhanshu Shukla | ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ (spacex falcon 9 rocket) భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది.
Shubhanshu Shukla | ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ (spacex falcon 9 rocket) భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. ప్రయోగం చేపట్టిన ఎనిమిది నిమిషాల్లోనే ఈ రాకెట్ భూమికి చేరింది. వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఐఎస్ఎస్కు వెళ్లే మార్గంలో నిర్ణీత సమయానికి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడిపోయింది. అనంతరం ఫాల్కన్ రాకెట్ తిరిగి సురక్షితంగా భూమికి చేరింది. ఈ క్యాప్సూల్ దాదాపు 28 గంటల పాటు ప్రయాణించి రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కు చేరుకుంటుంది. సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. స్పేస్ఎక్స్ కంపెనీ తయారుచేసిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్.
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’ (Axiom -4) మిషన్‌లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read..
Shubhanshu Shukla | రోదసిలోకి శుభాన్షు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్
Shubhanshu Shukla | రోదసి యాత్రకు ముందు.. తల్లిదండ్రులకు శుభాన్షు ఏం సందేశం పంపారంటే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

