
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో విషాదం నెలకొంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది స్థానిక డాక్టర్ వద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్టర్ హోమియోపతి మెడిసిన్ డ్రోసెరా 30లో నాటుసారా కలిపి ఆ కుటుంబ సభ్యులకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. దీంతో 8 మంది ఒకేసారి చనిపోగా, మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Chhattisgarh | 8 members of a family dead, 5 hospitalized after consuming a homeopathic medicine in Bilaspur, says CMO
— ANI (@ANI) May 6, 2021
"They consumed homeopathic medicine Drosera 30, which contains 91% alcohol mixed with country-made liquor. The doctor is absconding," he adds pic.twitter.com/HuIhnDQqU0