ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24% వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 24% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు స్థూలంగా మొత్తం రూ.8.98 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది.
- తొలి 6 నెలల్లో 8.98 లక్షల కోట్లు వసూలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 24% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు స్థూలంగా మొత్తం రూ.8.98 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. నిరుడు ఇదే కాలంలో వసూలైన ప్రత్యక్ష పన్నుల కంటే ఈసారి 23.8% అధికంగా వసూలైనట్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ పన్నులతోపాటు వ్యక్తిగత ఆదాయ పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 16.74%, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 32.30% పెరిగినట్టు ఆర్థిక శాఖ వివరించింది. రిఫండ్ల సర్దుబాటు తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయని, ఏడాది క్రితం ఇదే కాలంలో వచ్చిన నికర వసూళ్ల కంటే ఇది 16.3% అధికమని, బడ్జెట్ అంచనాల్లో ఈ వసూళ్లు 52.46 శాతానికి సమానమని పేర్కొన్నది. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఏప్రిల్ 1-అక్టోబర్ 8 మధ్య కాలంలో రూ.1.53 లక్షల కోట్లు రిఫండ్ చేశామని, నిరుడు ఇదే కాలంలో రిఫండ్ చేసిన మొత్తం కంటే ఇది 81% ఎక్కువని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

