పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79 వేల కోట్లను కేటాయించారు. అలాగే పట్టణ మౌలిక ప్రణాళికను చేపట్టేందుకు రాష్ర్టాలు, నగరాలను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79 వేల కోట్లను కేటాయించారు. అలాగే పట్టణ మౌలిక ప్రణాళికను చేపట్టేందుకు రాష్ర్టాలు, నగరాలను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కేంద్రం రూపొందిస్తున్నదని పేర్కొన్నారు. దీనిని జాతీయ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని వెల్లడించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పది వేల కోట్లను ఖర్చు చేస్తున్నదని, అన్ని నగరాలు, పట్టణాల్లో మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకులను మ్యాన్‌హోల్ నుంచి మెషిన్ హోల్ పద్ధతిలోకి వందశాతం మార్చునున్నామని తెలిపారు. పట్టణ పౌర సంస్థల ఆర్థిక, క్రెడిట్ యోగ్యతను మెరుగుపరిచేందుకు మునిసిపల్ బాండ్ల ద్వారా నిధులను సేకరించే విషయంలో ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

