న్యూఢిల్లీ: మన దేశంలోని సంస్థల్లో దాదాపు 79 % సంస్థలు నిరుడు రాన్సమ్వేర్ దాడులకు గురయ్యాయి. వీటిలో 91 శాతం సంస్థలు తమ డేటాను రికవర్ చేసుకోవడానికి లేదా దాడిని ఆపడానికి సొమ్మును చెల్లించాయి. రుబ్రిక్ జీరో ల్యాబ్స్ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. దాడులకు పాల్పడేవారు తరచూ మానవ, మానవేతర ఐడెంటిటీస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని రుబ్రిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా చెప్పారు. 90 శాతం ఇండియన్ ఆర్గనైజేషన్లు డిజిటల్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ను పెంచుకోవడం కోసం రానున్న 12 నెలల్లో ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది.