న్యూఢిల్లీ, జనవరి 28 : ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం ఉండాలని ఒక పక్క, వారానికి 90 గంటల పని వేళలు ఉండాలని ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సిఫార్సుపై మరో పక్క జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగానికన్నా తాము కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని 78 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఓ సర్వేలో వెల్లడించారు. భారతీయ ఉద్యోగుల వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ చేసిన తాజా సర్వే నివేదిక పేర్కొంది.
ప్రతి ఐదుగురిలో నలుగురు(78శాతం) కెరీర్లో ఎదుగడం కన్నా తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్టు నివేదిక తెలిపింది. మంచి జీతం ఉన్న ఉద్యోగంతోపాటు తక్కువ ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపే ఉద్యోగాలనే అధిక శాతం మంది కోరుకుటున్నట్టు ఈ సర్వే పేర్కొంది.