న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక వేడి వాతావరణం నెలకొంటున్న జిల్లాల సంఖ్య ఏటా పెరుగుతున్నది. దేశంలోని 57 శాతం జిల్లాలు హై హీట్ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయని ‘సీఈఈడబ్ల్యూ’ నివేదిక తెలిపింది. 76 శాతం దేశ జనాభా ఈ జిల్లాల్లోనే నివసిస్తున్నట్టు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 734 జిల్లాలకు సీఈఈడబ్ల్యూ పరిశోధకులు ‘హీట్ రిస్క్ ఇండెక్స్’ (హెచ్ఆర్ఐ)ను రూపొందించగా, ఇందులో 151 జిల్లాలు హై రిస్క్ జోన్లో, 266 జిల్లాలు వెరీ హై రిస్క్ క్యాటగిరీలో ఉన్నాయని నివేదిక హెచ్చరించింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్ సహా 10 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అత్యంత వేడి వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నది.