రియాసి: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణవోదేవి ఆలయంలో రోప్‌వే(Vaishnodevi Ropeway) ప్రాజెక్టును చేపడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ్టి నుంచి 72 గంటల పాటు కాట్రాలో బంద్ నిర్వహించనున్నారు. పోనీవాలాలు, షాప్కీపర్లు, ఇతర వ్యాపారులు అక్కడ బంద్ పాటించనున్నారు. దీంతో వైష్ణవోదేవి యాత్రికులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. కాట్రాలోని బేస్ క్యాంప్ నుంచి కొండపైకి రోప్‌వే నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఆ ప్రాజెక్టును స్థానిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు.
శ్రీ మాతా వైష్ణవోదేవి సంఘర్ష్ సమితి.. మంగళవారం సమ్మె ప్రకటించింది. బంద్ సమయంలో కాట్రాలో అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. 250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును చేపడుతున్నారు. టారాకోట్ మార్గ్ నుంచి సంజి చాట్ వరకు రోప్‌వే నిర్మించనున్నారు. కొండపైకి వృద్ధులు, చిన్నారుల్నితీసుకెళ్లేందుకు రోప్‌వేను నిర్మిస్తున్నారు.