న్యూఢిల్లీ, జనవరి 4: అమెరికాకు చెందిన అందమైన మోడల్‌గా చూపుకుంటూ..వందలాది మంది మహిళలను వేధించిన, బెదిరించిన ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆన్లైన్ వేదికలపై 700 మందికిపైగా మహిళలను మోసం చేసిన తుషార్ బిష్ట్(23)ను శనివారం ఢిల్లీ (వెస్ట్) సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బంబుల్, స్నాప్‌చాట్..డేటింగ్ యాప్‌ల్లో తనను తాను పెద్ద మోడల్‌గా పరిచయం చేసుకున్న తుషార్..వందలాది మంది మహిళలను ఆకర్షించాడు. అనంతరం అతడు వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించి..వారిని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు వసూలు చేసేవాడని డీసీపీ విచిత్ర వీర్ మీడియాకు వెల్లడించారు.