MTNL | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) కంపెనీ 7 ప్రభుత్వ బ్యాంకులకు రూ.8,346.24 కోట్ల రుణాలను ఎగ్గొట్టింది. ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ అప్పులను ఎగ్గొట్టినట్టు శనివారం ఓ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎంటీఎన్ఎల్ వెల్లడించింది.ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ మొత్తం అప్పులు రూ.33,568 కోట్లకు చేరగా, అందులో రూ.24 ,071 కోట్ల సావరిన్ గ్యారెం టీ బాండ్ రుణం కూడా ఉంది.