హజ్ యాత్రలో 68 మంది భారతీయుల మృతి
ముస్లింలు ఎంతో పవిత్రంగా జరిపే మక్కా యాత్రలో ఈ ఏడాది సుమారు 68 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు అద్యశ్యం కావడమో, తప్పిపోవడమో జరిగింది.
- మరికొంత మంది మిస్సింగ్.. వేడిమి తట్టుకోలేక పలువురు మృత్యువాత
రియాద్, జూన్ 19: ముస్లింలు ఎంతో పవిత్రంగా జరిపే మక్కా యాత్రలో ఈ ఏడాది సుమారు 68 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు అద్యశ్యం కావడమో, తప్పిపోవడమో జరిగింది. అయితే వీరు ఎంతమంది అన్నది తెలియరాలేదు. కాగా, హజ్ యాత్రలో ఈ ఏడాది మొత్తం 550 మంది యాత్రికులు మరణించినట్టు అరబ్ దౌత్యవేత్తలు మంగళవారం ప్రకటించారు. అలాగే సుమారు రెండు వేల మంది వివిధ దవాఖానలలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
అత్యంత వేడి వాతావరణాన్ని తట్టుకోలేకే పలువురు మరణించినట్టు నిర్వాహకులు తెలిపారు. మృతులలో 323 మంది ఈజిప్ట్, 60 మంది జోర్డాన్ పౌరులని, వేసవి వేడి వాతావరణం కారణంగా ఏర్పడిన సమస్యలతోనే వీరు మరణించినట్టు అరబ్ దౌత్య వర్గాలు తెలిపాయి. కాగా సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వేడికి తట్టుకోలేక పలువురు యాత్రికులు నెత్తిపై నుంచి బాటిళ్లతో నీరు వంపుకోవడం కన్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

