Layoffs | న్యూఢిల్లీ, మే 23: భారత్లో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 60 వేల మంది పొరుగు సేవల ఒప్పంద ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. కాంట్రాక్టర్ల ద్వారా కంపెనీలు నియమించుకొనే ఉద్యోగుల సంఖ్య 7.7 శాతం తగ్గిపోయిందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసుకొచ్చి పని చేయడంలో మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ నుంచి ఐటీ ప్రాజెక్టులు తగ్గినట్టు తెలుస్తున్నదని ఫెడరేషన్ అధ్యక్షుడు లోహిత్ భాటియా వెల్లడించారు.