శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం 60 మంది విదేశీ ఉగ్రవాదులు(Foreign Terrorists) యాక్టివ్గా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంట్లో 35 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఉన్నారు. కశ్మీర్లో జరుగుతున్న చొరబాటుదారుల హింసలో 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఉగ్రవాదుల జాబితాలో.. లష్కరే తోయిబాతో పాటు జేష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. యాక్టివ్గా ఉన్నవారిలో 21 మంది జేషై మొహమ్మద్, ముగ్గురు హిజ్బుల్ వ్యక్తులు ఉన్నారు. యాక్టివ్గా ఉన్న 17 మంది స్థానికుల్లో.. 14 మంది శ్రీనగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మరో ముగ్గురు జమ్మూ సెక్టార్ నుంచి యాక్టివ్గా ఉన్నారు.