(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని రాజాపూర్ గ్రామంలోని కంబాల నైకెస్ వీధిలో తరతరాలుగా సాగుతున్న వివక్షతకు ఆ గ్రామ ప్రజలు చరమ గీతం పాడారు. నిషేధిత వీధిలో దళితులు తొలిసారి చెప్పులు వేసుకొని తిరిగారు.
స్వాతంత్య్రం తర్వాత ఇక్కడ వీధి మొదట్లో ‘వూడూ’ అనే బొమ్మను పాతిపెట్టి, దళితులెవరైనా చెప్పులతో ఆ వీధిలోకొస్తే మూడు నెలల్లో చనిపోతారని ప్రచారం చేశారు. దళిత మహిళ ప్రవేశంపై నిషేధం విధించారు. అప్పటి నుంచి దళితులెవరూ ఆ వీధిలో చెప్పులు లేకుండానే నడుస్తూ వచ్చారు.