చండీగఢ్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు ఆరుగురు స్కూల్ విద్యార్థులు మరణించారు. (6 Students, Driver Killed) మరో ముగ్గురు స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత 9 మంది విద్యార్థులు ఎస్యూవీ వాహనంలో తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.
కాగా, సమానా-పాటియాలా రహదారిపై ఎస్యూవీ వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌తో సహా ఆరుగురు స్కూల్ పిల్లలు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన స్కూల్ పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. మరణించిన స్కూల్ పిల్లల వయస్సు 12 నుంచి 13 ఏళ్లు ఉంటాయని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.