Sikkim Floods | సిక్కిం వరదలు.. 53కు చేరిన మృతుల సంఖ్య
Sikkim Floods | తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. సిక్కింతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కిం వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
Sikkim Floods | గ్యాంగ్‌టక్ : తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. సిక్కింతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కిం వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వీరిలో ఏడుగురు సైనికులు ఉన్నారు. గల్లంతై ఇంకా ఆచూకీ తెలియని 142 మంది కోసం మూడో రోజైన శుక్రవారం ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు కొనసాగింది.
1,173 నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని సిక్కిం గవర్నమెంట్ వెల్లడించింది. 2,413 మందిని రక్షించినట్లు తెలిపింది. తీస్తా – వీ హైడ్రో పవర్ స్టేషన్‌కు దిగువన ఉన్న బ్రిడ్జిలన్ని ధ్వంసమయ్యాయి. కొన్ని వంతెలు వరదలకు కొట్టుకుపోయాయి. నార్త్ సిక్కింలో కమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్షించారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దెబ్బతిన్న రోడ్లను వీలైనంత వరకు పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

