పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు 53% హాజరు
16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీసీఏ) సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53శాతానికే పరిమితమవుతున్నదని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి.
- లోక్సభ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ : 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీసీఏ) సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53శాతానికే పరిమితమవుతున్నదని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. నిరుడు సెప్టెంబర్లో ఈ కమిటీలను పునర్వ్యవస్థీకరించినప్పటి నుంచి వివిధ కీలక అంశాలపై జరిగిన చర్చలకు సగటున 53 శాతం మంది సభ్యులే హాజరయ్యారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో కనీస సభ్యులు లేకపోవడం కారణంగా పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన ఐదు సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఒక్కో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక పబ్లిక్ కమిటీ విషయానికొస్తే మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. వీరిలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. వ్యవసాయం, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, రసాయనాలు-ఎరువులు, ఇంధన, సామాజిక న్యాయం-సాధికారత తదితర 16 స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగటున దాదాపు 47 శాతం మంది సభ్యులు సమావేశాలకు గైర్హాజరయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

