న్యూఢిల్లీ : దేశంలో అనేకమంది గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కొని మనుగడ సాగిస్తున్నారని జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్) వెల్లడించింది. 2012-2015 మధ్య ఈ వ్యాధి బారినపడిన వారిలో 52 శాతం మంది దీన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపింది.
ప్రస్తుతం వారంతా మనుగడ సాగిస్తున్నారని పేర్కొన్నది. అత్యధిక శాతం మంది మనుగడ సాగిస్తున్న నగరాల్లో అహ్మదాబాద్ (61.5 శాతం), తిరువనంతపురం (58.8 శాతం), కొల్లం (56.1 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.