శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రియాసిలో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి(Reasi Attack) చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ఘటనతో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని ఆధీనంలోకి తీసుకున్నారు. రియాసి జిల్లాలో ఓ బస్సుపై కాల్పులు జరపగా, ఆ కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. 41 మంది గాయపడ్డారు. 50 మందిని అరెస్టు చేసిన పోలీసులు .. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.