సాత్నా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో కొందరు ఆకతాయిలు సుమారు 50 గోవుల్ని నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో సుమారు 20 ఆవులు చనిపోయినట్టు తెలిసింది. నిందితులు ఆవుల్ని నదిలోకి తోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఆకతాయులు దాదాపు 50 ఆవులను నదిలోకి తోసేశారు. వీటిలో 20 వరకు చనిపోగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.