KMP Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపు తప్పిన స్కార్పియో.. అయిదుగురు పోలీసులు మృతి
KMP Expressway: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుండలి-మనేసర్-పల్వాల్ కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే(KMP Expressway)పై జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయిదుగురు పోలీసులు మృతిచెందారు. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.
నుహ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుండలి-మనేసర్-పల్వాల్ కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే(KMP Expressway)పై జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయిదుగురు పోలీసులు మృతిచెందారు. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. తౌరు సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దులావత్ టోల్ ప్లాజా వద్ద దుర్ఘటన చోటుచేసుకున్నది. ప్రమాద ప్రదేశానికి స్థానిక పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు వెళ్లాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. యూపీలోని జలౌన్ జిల్లాలో ఆ పోలీసులు పోస్టింగ్‌లో ఉన్నారు. మహేంద్ర స్కార్పియో వాహనంలో వాళ్లు పల్వాల్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
టోల్ ప్లాజా సమీపంలో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో.. అదుపు తప్పి ముందున్న వాహనాన్ని స్కార్పియో ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఎస్యూవీ నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆ వాహనంలో ఉన్న అయిదుగురు పోలీసులు మృతిచెందారు. వాహన శిథిలాల్లో చిక్కుకున్న వారిని తొలగించారు. స్కార్పియో వాహనంలో మృతిచెందిన అయిదుగుర్నీ పోలీసులుగా గుర్తించినట్లు తౌరు సదర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. బాధితులను గుర్తించి, ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

