నవాడా (బీహార్), నవంబర్ 25: ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు కేవలం 5 సార్లు గుంజీలు తీసి నేరం నుంచి విముక్తి పొందాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీహార్లోని నవాడా జిల్లాలో చోటుచేసుకున్నది.
మైనర్పై లైంగికదాడి జరిగినట్టు బయటపడటంతో పంచాయితీ పెద్దలు సమావేశమయ్యారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి శిక్ష వేశారు. 5 సార్లు గుంజీలు తీయాలని ఆదేశించారు. దీంతో నిందితుడు గుంజీలు తీసి నేరం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.