రాయ్‌బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జైలులో ఓ వార్డెన్‌ను తొటి సిబ్బంది కొట్టారు. ఆ జైలు మెస్ ఫుడ్ విషయంలో వార్డెన్ల మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. తమ క్యాంటీన్ వ్యాపారంపై ప్రభావం పడుతుందన్న కోపంతో ముగ్గురు జైలు సిబ్బంది వార్డెన్‌ను లాఠీలతో కొట్టారు. జైలు బయట ఉన్న సీసీటీవీ కెమెరాకు ఈ ఘటన చిక్కింది. రాయ్‌బరేలి జిల్లా జైలులోనే అందరూ పనిచేస్తున్నారు.
జైలు మెస్ ఇంచార్జి ముఖేశ్ దూబేను … ఆ జైలులో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు కర్రెలతో కొట్టారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు ఆ చోద్యాన్ని చూస్తు ఉండిపోయారు. ఇంకా కొట్టండి అంటూ దూబే అరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. రాయ్‌బరేలి పోలీసులు దీనిపై స్పందించారు. అయిదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించారు.
జైలు మెస్‌లో ఫుడ్ నాణ్యతను తగ్గించాలని సిబ్బంది తనపై దాడి చేసినట్లు ముకేశ్ దూబే తెలిపారు. చికిత్స కోసం ముకేశ్‌ను హాస్పిటల్లో చేర్పించారు.