న్యూఢిల్లీ: ఆసియాలోని టాప్ 100 విద్యా సంస్థల జాబితాలో మన దేశానికి చెందిన ఐదు ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉన్నాయి. మంగళవారం విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ఆసియా ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఏడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు చోటు దక్కింది.
అవి: ఢిల్లీ, మద్రాస్, బాంబే, కాన్పూర్, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు; బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం.