ఇంఫాల్, సెప్టెంబర్ 19: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆయుధాల్ని కలిగివున్నారన్న ఆరోపణలతో ఐదుగురు యువకుల్ని భద్రతా బలగాలు అరెస్టు చేయగా, దీనిపై రాష్ట్రంలోని మహిళా సామాజిక సంస్థ ‘మీరా పైబి’, స్థానిక క్లబ్బులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టు చేసిన యువకుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈనేపథ్య ంలో మంగళవారం రాజధాని ఇంఫాల్ సహా పలు చోట్ల సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. ఇదిలా ఉండగా, ఆర్మీ జవాన్ తాంగ్తాంగ్ కోమ్ హత్యపై మణిపూర్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటుచేసింది.