Regional Political Parties Income | 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
Regional Political Parties Income | 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఈ నిధుల్లో 70 శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది.
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు (Regional Political Parties Income) రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఈ నిధుల్లో 70 శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఎన్నికల సంఘం(ఈసీ)కి సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అత్యధికంగా రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.646.39 కోట్లు, బీజూ జనతాదళ్ (బీజేపీ) రూ.297.81 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రూ.285.07 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రూ.191.04 కోట్ల ఆదాయంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ ఐదు పార్టీల ఆదాయం వాటా 83.17 శాతం.
కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 45.77 శాతం మేర పెరిగిందని ఏడీఆర్ తెలిపింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,736.85 కోట్లుగా పేర్కొంది. టీఎంసీకి రూ. 312.93 కోట్ల మేర ఆదాయం పెరిగింది. టీడీపీ, బీజేపీ కూడా గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం రూ.430.60 కోట్లు, టీఎంసీ రూ. 414.92 కోట్లు, బీజేడీ రూ. 253.79 కోట్లు మేర ఆదాయాన్ని ఖర్చు చేయలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ఆదాయం కంటే సుమారు 55 శాతం ఎక్కువ ఖర్చులు వైస్సార్ కాంగ్రెస్ చూపింది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ఎలాంటి ఆదాయం లేనప్పటికీ రూ.1.56 లక్షల వ్యయం ప్రకటించింది.
కాగా, బీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, డీఎంకే సహా పది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో రూ. 2,117.85 కోట్లు (83.64 శాతం) స్వచ్ఛంద విరాళాల నుంచి వచ్చాయి. ఇందులో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు రూ. 1,796.02 కోట్లు (70.93 శాతం).
మరోవైపు ఏడీఆర్ ఆర్టీఏ దరఖాస్తుకు ప్రతిస్పందనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలు రూ. 4,507.56 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను తిరిగి పొందాయి. ఇందులో దాదాపు 55.99 శాతం (రూ. 2,524.14 కోట్లు) జాతీయ పార్టీలు, 39.84 శాతం (రూ. 1,796.02 కోట్లు) ప్రాంతీయ పార్టీలు సేకరించాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం మూడు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
Also Read:
JK AAP MLA Arrest | ఎమ్మెల్యే అరెస్ట్‌పై నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత, పరీక్షలు రద్దు
man kills two women | ఇద్దరు మహిళలను హత్య చేసిన వ్యక్తి.. పోలీస్ కస్టడీలో ఆత్మహత్య
Watch: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమాని.. అధికారులు ఏం చేశారంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

