రాజ్యసభ కొత్త సభ్యుల్లో… 40 శాతం మందికి నేర చరిత్ర
న్యూఢిల్లీ: ఇటీవల రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం మందికి నేర చరిత్ర ఉంది. ఇందులో 12 శాతం మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపాయి. హత్య, మహిళలపై నేరాలతో సహా అనేక నేరారోపణలు వారు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన 57 మంది కొత్త ఎంపీల్లో 23 మందిపై (40 శాతం) నేర సంబంధ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే 12 మందిపై (21 శాతం) హత్య, హత్యా యత్నం, దొంగతనం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేర కేసులున్నట్లు ఏడీఆర్ తెలిపింది.
కాగా, 22 మంది బీజేపీ కొత్త రాజ్యసభ సభ్యుల్లో 9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల్లో నలుగురికి, టీఆర్ఎస్, ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎంపీలు, వైఎస్ఆర్పీ, డీఎంకే, ఏఐడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఎస్హెచ్ఎస్, ఇండిపెండెంట్ నుంచి ఒక్కో ఎంపీకి నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది.
మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని 11 మంది ఎంపీల్లో ఆరుగురికి, మహారాష్ట్రలోని ఆరుగురు ఎంపీల్లో నలుగురికి, తమిళనాడులోని ఆరుగురు ఎంపీల్లో ముగ్గురికి, బీహార్‌లోని ఐదుగురు ఎంపీల్లో నలుగురికి, తెలంగాణ, ఏపీ ఎంపీల్లో ఒకొక్కరికి, ఛత్తీస్‌గఢ్‌లోని ఇద్దరిలో ఒకరికి, రాజస్థాన్‌లోని నలుగురు ఎంపీల్లో ఒకరికి, హర్యానాలోని ఇద్దరు ఎంపీలో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
అలాగే రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 53 మంది (93 శాతం) మిలియనర్లని, మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్ఎస్కు చెందిన బండి పార్థ సారధి మొత్తం ఆస్తులు రూ.5,300 కోట్లు, ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ మొత్తం ఆస్తులు రూ.608 కోట్లు, పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ మొత్తం రూ.498 కోట్ల ఆస్తులని ఏడీఆర్ వివరించింది. కొత్తగా ఎన్నికైన సగటు ఎంపీల ఆస్తుల విలువ రూ.154.27 కోట్లుగా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

