థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ బార్లో అసభ్యకర ప్రవర్తన(Obscenity Acts) కింద 40 మందిపై కేసు నమోదు చేశారు. దీంట్లో 8 మంది మహిళా సర్వర్లు, మరికొంత మంది కస్టర్లు కూడా ఉన్నారు. బార్లో ఆ వ్యక్తులు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణ్-షిల్ రోడ్డు మార్గంలో ఉన్న బార్లో అర్థరాత్రి అధికారులు తనిఖీ నిర్వహించారు.
ఆ సమయంలో బార్లో అసభ్యకర సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 14వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. డోంబివాలిలోని మన్పాడా పోలీసులు.. బార్‌తో లింకున్న 23 మంది పురుషులపై కేసు బుక్ చేశారు. 8 మంది మహిళా సర్వర్లు, 8 మంది కస్టమర్లపై కూడా ఆ కేసు నమోదు చేశారు. కేసుతో లింకున్న ఎవర్నీ అరెస్టు చేయలేదు.