Lok Sabha Elections | మధ్యాహ్నం 1 గంట వరకూ 40 శాతం మేర పోలింగ్
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 57 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఎన్నికల అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 48.63 శాతం మేర పోలింగ్ నమోదైంది. బీహార్‌లో అత్యల్పంగా 35.65 శాతం ఓటింగ్ నమోదైంది. చండీగఢ్‌లో 40.14 శాతం, జార్ఖండ్‌లో 46.80 శాతం, ఒడిశాలో 37.64 శాతం, పంజాబ్‌లో 37.80 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 39.31 శాతం, పశ్చిమ బెంగాల్లో 45.07 శాతం మేర పోలింగ్ నమోదైంది.
#LokSabhaElections2024 | 40.09% voter turnout recorded till 1 pm, in the 7th phase of elections.
Bihar 35.65%
Chandigarh 40.14%
Himachal Pradesh 48.63%
Jharkhand 46.80%
Odisha 37.64%
Punjab 37.80%
Uttar Pradesh 39.31%
West Bengal 45.07% pic.twitter.com/4jsl6EwUjG— ANI (@ANI) June 1, 2024
ఈ దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగుతున్నాయి. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.
ఈ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో అత్యధికంగా పంజాబ్‌లో 328 మంది, ఉత్తరప్రదేశ్‌లో 144 మంది, బీహార్ 134, ఒడిశా 44, జార్ఖండ్ 52, హిమాచల్‌ప్రదేశ్ 37, చండీగఢ్‌లో 19 చొప్పున బరిలో ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read..
Violence | తుదిదశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస.. ఈవీఎంలను నీటికుంటలో పడేసి
Bomb Threat | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి
Drugs | చిన్నారుల టాయ్స్, లంచ్ బాక్సుల్లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

