Bomb Threat | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి
ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 ( IndiGo flight 6E 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్నది.
ముంబై: ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 ( IndiGo flight 6E 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్నది. ఈ క్రమంలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీలు చేస్తున్నారు.
‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉన్నది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్ ప్రకటించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో ఇండో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి.
మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. గత మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా బాత్రూమ్లో ఓ టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దించేశారు. అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

