Terrorists Arrest | అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరు శ్రీలంక వాసులని తెలుస్తోంది. అనుమానితులను ఏటీఎస్ అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. విమానాశ్రయానికి ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులు రావడం వెనుక ఉద్దేశమేమిటన్న సంగతి తెలియలేదని ఏటీఎస్ అధికారులు చెప్పారు. తాజా పరిణామం నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రత పటిస్టం చేశారు. దేశంలో ఐపీఎల్ 17 సీజన్ మ్యాచ్ లు జరుగుతుండగా, మూడు ఐపీఎల్ జట్లు విమానాశ్రయానికి చేరుకునే ముందు ఐఎస్ ఉగ్రవాదులను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు.