లక్నో: నాలుగు షాపులు కూలిపోయాయి. (Shops Collapses) ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. సికంద్రా ప్రాంతంలో హౌసింగ్ డెవలప్మెంట్ (ఆవాస్ వికాస్) డిపార్ట్మెంట్ నిర్మించిన షాపులను పునరుద్ధరిస్తున్నారు. అయితే శనివారం ఈ పనులు చేస్తుండగా నాలుగు షాపులు కూలిపోయాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుసుకున్నారు. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ఐదుగురిని కాపాడారు. మరో ఇద్దరు వ్యక్తులను కూడా శిథిలాల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త కోసం అంబులెన్స్‌లను అక్కడకు రప్పించారు.
आगरा आवास विकास में जर्जर मकान गिरने से मलवे मैं कुछ लोगो के दबे होने की सूचना,
मोके पर पहुंची पुलिस बचाव कार्य मैं जुटी,
जेसीबी की मदद से मलवा हटाया जा रहा है।
सेक्टर-4 पुलिस चौकी आवास विकास का मामला।@Uppolice @agrapolice pic.twitter.com/RnyMHhtCc8— Naseem Ahmad Journalist NDTV (@NaseemNdtv) April 5, 2025