e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జాతీయం యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌

యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌

యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో అక్ర‌మంగా నివసిస్తున్న న‌లుగురు రోహింగ్యాల‌ను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) శుక్ర‌వారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫిజుర్ రెహ్మాన్, మొహద్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, విదేశీ కరెన్సీతో సహా ప‌లు న‌కిలీ పత్రాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాలు దేశంలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించేందుకు, నివాసం ఉండేందుకు అవ‌స‌ర‌మైన న‌కిలీ ప‌త్రాలు త‌యారు చేసిన ఏజెంట్ల గ్యాంగ్‌ను గుర్తించిన‌ట్లు యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్ర‌శాంత్ కుమార్ తెలిపారు. ఈ ముఠాలు ఐక్యరాజ్యసమితి హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీ పేరుతో న‌కిలీ కార్డులు తయారు చేస్తాయ‌ని, రోహింగ్యాల నుంచి చాలా డబ్బు వసూలు చేసి నకిలీ ఇండియన్ ఐడీల‌ను త‌యారు చేసి చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తార‌ని వెల్ల‌డించారు. ఇలాంటి వ్యక్తులు క్రిమినల్, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌
యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌
యూపీలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న న‌లుగురు రోహింగ్యాలు అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement