థానే: ఆ ఇంట్లో ఏం జరిగిందో ఏమోగానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేకుల ఇల్లు కావడంతో ఆ రేకుల సందుల్లోంచి కూడా మంటలు పైకి ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో హుటాహుటిన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలోగల శివాజీనగర్ ఏరియాలో ఇవాళ మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల ద్వారా ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందని రప్పించారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు ప్రస్తుతం ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
#WATCH | Maharashtra | 4 people were severely injured after fire broke out in Thane Shivaji Nagar. Four fire engines rushed to the spot and brought the fire under control. pic.twitter.com/jOQ00AASCI
— ANI (@ANI) May 22, 2023