న్యూఢిల్లీ: ఢిల్లీ(Delhi)లో ప్రగతి మైదాన్ టన్నెల్లో భారీ చోరీ(Robbery) జరిగింది. కారులో వెళ్తున్న ఓ డెలివరీ ఏజెంట్‌ను .. నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లో వెంబడించారు. ఆ కారును అడ్డుకున్న ఆ బైకర్లు.. ఆ తర్వాత తమ వద్ద ఉన్న గన్‌తో బెదిరించి.. కారులో నుంచి 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. టన్నెల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఈ ఘటన చిక్కింది. గురుగ్రామ్‌లో క్యాష్ బ్యాగును డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఇద్దర్ని దుండగులు వెంటాడినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఈ చోరీ జరిగింది.
ఓలా క్యాబ్‌లో వెళ్తున్న డెలివరీ బాయ్ తన కారును రెడ్ ఫోర్ట్ ఏరియాలో బుక్ చేసుకున్నాడు. అయితే రింగు రోడ్డు వద్ద ఉన్న టన్నెల్లోకి రాగానే రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు అడ్డుకున్నారు.
#WATCH | A delivery agent and his associate were robbed at gunpoint of Rs 1.5 to Rs 2 lakh cash by a group of unknown assailants inside the Pragati Maidan Tunnel on June 24. Police registered a case and efforts are being made to apprehend the criminals: Delhi Police
(CCTV… pic.twitter.com/WchQo2lXSj
— ANI (@ANI) June 26, 2023
టన్నెల్లో జరిగిన చోరీ ఘటనను సీఎం కేజ్రీవాల్ ఖండించారు. రాజధానిలో శాంతిభద్రతల సమస్యకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కారణమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఎల్జీ రాజీనామా చేయాలని, భద్రతను కల్పించే వారికి అధికారం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రక్షణ కల్పించలేకపోతున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.