న్యూఢిల్లీ: శాస్త్రవేత్తలు కొత్త మందులను అభివృద్ధి చేసినపుడు, మనుషులపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ముందుగా జంతువులపై ప్రయోగాలు చేస్తారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎడిన్బరో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ పరికరం ఈ ప్రయోగాలకు ఉపయోగపడుతుంది.
రోగి శరీరంలోని వివిధ అవయవాలకు ఔషధం చేరినపుడు, ఏ అవయవం ఏ విధంగా స్పందిస్తున్నదో ఈ త్రీ-డీ ప్రింటెడ్ “బాడీ-ఆన్-చిప్” పరికరం అనుకరించి చూపుతుంది. ఈ డివైస్ వల్ల జంతువులపై ఆ ఔషధాన్ని ప్రయోగించక్కర్లేదు.