న్యూఢిల్లీ: పరిమాణంలో సూర్యుడి కన్నా 3,600 కోట్ల రెట్ల పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడిన కృష్ణ బిలాల్లో ఇదే అతి పెద్దది. అంతుబట్టని, సంక్లిష్టమైన ఖగోళ వింతల గురించి మన అవగాహనను ఈ పరిశోధన మరింత పెంచింది.
మనకు బాగా తెలిసిన అతి పెద్ద పాలపుంతల్లో ఒకటైన కాస్మిక్ హార్స్‌షూ నడిబొడ్డున ఈ భారీ కృష్ణబిలం ఉన్నట్లు గుర్తించారు. భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. ఈ పరిశోధనకు సారథ్యం వహించిన పోర్ట్స్మౌత్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ కొల్లెట్ మాట్లాడుతూ, టాప్ 10 భారీ కృష్ణబిలాల్లో ఇది ఒకటి అని చెప్పారు. ఇది నిద్రావస్థలో ఉన్నట్లు చెప్పారు.