న్యూఢిల్లీ, మే 27: ఈసారి జమ్ముకశ్మీర్‌లో రికార్డ్‌స్థాయి ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లోని 5 లోక్‌సభ స్థానాల్లో 58.46శాతం ఓటింగ్ నమోదైందని, గత 35 ఏండ్లలో ఇదే అత్యధికమని సీఈసీ రాజీవ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో (19.16శాతం) పోల్చితే ఓటింగ్ శాతం అనూహ్యంగా 30శాతం పెరిగిందన్నారు. ‘పోలింగ్‌లో ఇక్కడి ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది సానుకూల సంకేతం’ అని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ త్వరలో చేపడుతుందని చెప్పారు.