భార్యను పొడిచి చంపి మానసిక రోగి ఆత్మహత్య
Murder in UP: భార్యను కత్తితో పొడిచి చంపడమేగాక, అదే కత్తితో తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మహోబా: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో పొడిచి చంపడమేగాక, అదే కత్తితో తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్డుకోబోయిన తన సోదరిని కూడా కత్తితో గాయపర్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజానగర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బిజానగర్కు చెందిన సంతోష్ రఖ్వార్ (35), సరస్వతి (32) ఇద్దరూ భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా సంతోష్ రఖ్వార్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సంతోష్ రఖ్వార్ తన భార్యను కత్తితో పొడిచాడు. అతని సోదరి ఆర్తి (17) అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా గాయపర్చాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కత్తి గాయాలు అయిన సంతోష్ రఖ్వార్ సోదరి ఆర్తి కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

