కరోనా కట్టడికి 34 గంటల కర్ఫ్యూ..
కర్ఫ్యూ| కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి 34 గంటల కర్ఫ్యూని అధికారులు అమలు చేస్తున్నారు.

శ్రీనగర్: కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి 34 గంటల కర్ఫ్యూని అధికారులు అమలు చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో అన్నిరకాల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసరమైన సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 8 నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉన్నది. అనంతరం ఏప్రిల్ 20న దాన్ని 20 జిల్లాల్లోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలకు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతంలో నిన్న 2030 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,374కు చేరింది. ఇందులో 2126 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

