న్యూఢిల్లీ: అదానీ గ్రూపు(Adani Group)కు చెందిన వివిధ స్విస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సుమారు 31 కోట్ల డాలర్ల నిధులను స్విట్జర్లాండ్ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని హిండన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ పేర్కొన్నది. అయితే ఆ వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. హిండెన్‌బర్గ్ సంస్థ తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేసింది. అదానీ గ్రూపు మనీల్యాండరింగ్‌కు పాల్పడిందని, విదేశీ పెట్టుబడులకు చెందిన సుమారు 310 మిలియన్ డాలర్ల నిధులను సీజ్ చేసినట్లు ఆ ట్వీట్లో హిండెన్‌బర్గ్ తెలిపింది. బీవీఐ, మారిషెస్, బెర్ముడాల్లో అదానీ స్టాక్స్‌కు చెందిన నిధులను ఇన్వెస్ట్ చేసినట్లు ఓ రిపోర్టులో తెలిపారు.
హిండెబన్బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. స్విస్ కోర్టు విచారణలతో తమకు ఎటువంటి సంబంధం లేదని అదానీ గ్రూపు పేర్కొన్నది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నామని, అదానీ గ్రూపుకు స్విస్ కోర్టు విచారణలతో సంబంధంలేదని ఆ కంపెనీ తెలిపింది. స్విస్ కోర్టు తన తీర్పులో తమ గ్రూపుల గురించి ఎటువంటి కామెంట్ చేయలేదని అదానీ సంస్థ వెల్లడించింది.
Swiss authorities have frozen more than $310 million in funds across multiple Swiss bank accounts as part of a money laundering and securities forgery investigation into Adani, dating back as early as 2021.
Prosecutors detailed how an Adani frontman invested in opaque…
— Hindenburg Research (@HindenburgRes) September 12, 2024