శ్రీనగర్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 300 కేజీల ఆర్డీఎక్స్(300 Kg RDX)తో పాటు ఏకే-47 రైఫిల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని షహరాన్‌పూర్‌లో కశ్మీరీ డాక్టర్‌ను అరెస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. జైషే మొహమ్మద్‌కు అనుకూలంగా పోస్టర్లు ప్రచురించిన నేపథ్యంలో ఆ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఫరీదాబాద్‌లో ఆయుధాలను రికవరీ చేశారు. ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర ఆయుధాలను స్టోర్ చేసినట్లు గుర్తించారు. ఆ డాక్టర్‌ను కూడా ప్రస్తుతం నిఘాలో పెట్టారు.
అనంత్‌నాగ్‌లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని రాథర్ లాకర్ నుంచి ఏకే-47 రైఫిల్‌తో పాటు ఆయుధాలను జమ్మూకశ్మీర్ పోలీసులు కొన్ని రోజుల క్రితం సీజ్ చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్, హర్యానా పోలీసుల సంయుక్త సహకారంతో ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. డాక్టర్ రాథర్పై యూఏపీ చట్టం కింద కేసు పెట్టారు. ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు విషయంలో డాక్టర్ నిమగ్నమైనట్లు దర్యాప్తు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. ఫరీదాబాద్‌కు ఎందుకు అంత భారీ ఆయుధాలను తరలించారో స్పష్టంగా తెలియడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.