Women Gang Raped | హర్యానాలో దారుణం.. కుటుంబ సభ్యుల ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడి
Women Gang Raped | సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Women Gang Raped) హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
చండీగఢ్: సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Women Gang Raped) హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కత్తులు, పదునైన ఆయుధాలు కలిగిన నలుగురు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి వేళ మహిళా కూలీల ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. అనంతరం కుటుంబ సభ్యుల ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లోని డబ్బు, నగలు దోచుకున్నారు.
కాగా, అదే గ్రామంలో మరో ఇంటిపై కూడా ఆ వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తి నుంచి డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకున్నారని చెప్పారు. ఈ రెండు సంఘటనలపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

