చండీగఢ్: మూడంతస్తుల భవనం కుప్పకూలింది. (building collapse) శిథిలాల కింద పలువురు వ్యక్తులు చిక్కుకున్నారు. ఫైర్, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పంజాబ్లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. బేస్మెంట్ కోసం తవ్వకం పనులు జరుగుతుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్లో జిమ్ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. రెస్క్యూ పనులు చేపట్టారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని నివాసితులు భయాందోళన చెందారు.
#WATCH | A multi-storey under-construction building collapsed in Punjab’s Mohali. Rescue operations are underway. More details awaited pic.twitter.com/Q0Lv30Ex3d
— ANI (@ANI) December 21, 2024