అరేబియాలో కూలిన హెలికాప్టర్
- ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు మృతి
న్యూఢిల్లీ/ముంబై, జూన్ 28: అరేబియా సముద్రంలో ఓఎన్జీసీకి చెందిన పవన్‌హన్స్ హెలిక్టాపర్ మంగళవారం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు మరణించారు. ముంబై తీరానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు పైలట్లతో సహా హెలికాప్టర్లో తొమ్మిది మంది ఉన్నారు. జుహు హెలిబేస్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ సముద్రంలోని ఓఎన్జీసీకి చెందిన సాగర్ కిరణ్ రిగ్ వద్దకు చేరుకోవాల్సి ఉన్నది. మరో 4-5 నిమిషాల్లో అక్కడకు వెళ్తుందనగా కూలింది. అయితే హెలికాప్టర్ కూలినప్పటికీ ఫ్లోటర్ల సాయంతో సముద్రంపై తేలియాడుతూ ఉన్నది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీతో పాటు నేవీ సిబ్బంది వెంటనే రెస్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకొని హెలికాప్టర్‌లోని తొమ్మిది మందిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఘటన సమయంలో పశ్చిమ సముద్ర తీరంలో ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్నదని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

