భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) మరో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులను అర్ధ నగ్నంగా చేసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నర్మదాపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 13న గ్రామస్తుల పట్ల ముగ్గురు వ్యక్తులు దరుసుగా ప్రవర్తించినట్లు జావలి గ్రామానికి చెందిన కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు ధరించిన దుస్తులను బలవంతంగా తీయించారు. అర్ధ నగ్నంగా నేలపై బోర్లా పడుకోబెట్టారు. ఆ ముగ్గురి వీపులు, కాళ్లు, పిర్రలపై దారుణంగా కర్రలతో కొట్టారు. దెబ్బలు తాళలేక ఆ ముగ్గురు వ్యక్తులు అల్లాడిపోయారు.
కాగా, కొందరు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ముగ్గురు వ్యక్తులను దారుణంగా కొట్టిన ఆరుగురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో వారిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి శుక్రవారం తమకు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
मध्य्प्रदेश(नर्मदापुरम): गांव के कुछ लोगों से बदतमीजी करने के आरोप में अमजद अली, सौरभ नागंवशी और पिन्नु नागवंशी नामक युवकों को लोगों ने बांध कर पीटा, पैर तोड़े। पुलिस ने बताया कि 6 लोगों के खिलाफ़ 6 धाराओं में मामला दर्ज़ कर नोटिस दिया गया है।@KashifKakvi pic.twitter.com/rGAdbz3RLC
— Ashraf Hussain (@AshrafFem) July 15, 2023